కాకినాడ సిటీ: కాకినాడ ఆసుపత్రి ఎదుట రోగి బంధువుల ధర్నా: సర్వర్ సాకుతో బిల్లులు చెప్పలేదని ఆరోపణ
కాకినాడ రూరల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి మృతి చెందిన తర్వాత బిల్లుల చెల్లింపు విషయంలో వివాదం నెలకొంది. వివరాలు అడిగితే సర్వర్ పనిచేయడం లేదని సిబ్బంది చెప్పారని, ఇప్పుడు బిల్లులు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ బంధువులు ధర్నాకు దిగారు.