కాకినాడ సిటీ: కాకినాడ: కాలువలు, డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపునకు జేసీ ఆదేశాలు
కాకినాడలో ముంపు సమస్య నివారణపై జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సమీక్ష. కాలువలు, డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశం. పంట నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి ఆక్రమణలు తొలగించాలని సూచన.