భువనగిరి: భువనగిరి-చిట్యాల రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని నాగిరెడ్డిపల్లి గ్రామస్తుల డిమాండ్
భువనగిరి వయా చిట్యాల రహదారి గుంతలమయంగా మారడంతో నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వాహనాలు సకాలంలో రాక ప్రాణనష్టం జరుగుతోందని, తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.