నారాయణ్‌ఖేడ్: ఖేడ్ మండలం పలుగుతండాలో పాము కాటుకు గురైన రైతు: సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు
ఖేడ్ మండలం పలుగుతండాలో గడ్డి కోసేందుకు వెళ్లిన చౌహాన్ రాజునాయక్ పాము కాటుకు గురయ్యారు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం వైద్యులు సంగారెడ్డికి రిఫర్ చేశారు. మాజీ జడ్పీటీసీ రవీందర్ నాయక్ బాధితుడిని పరామర్శించారు.