కాకినాడ సిటీ: కాకినాడ: నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ జి. బిందు మాధవ్
కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పరిశీలించారు. అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించవద్దని, నిబంధనలను పాటించాలని ఎస్పీ సూచించారు. శాంతిభద్రతల కోసం అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.