శ్రీశైలం: లైక్ సిస్టర్ ఘటనలో కొత్తపల్లి కేజీబీవీ ప్రిన్సిపల్ కృష్ణబాయిని విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ డీఈఓ జనార్దన్ రెడ్డి
కొత్తపల్లి కేజీబీవీ ప్రిన్సిపల్ కృష్ణబాయిని విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ డీఈఓ జనార్దన్ రెడ్డి. ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 23న కస్తూరిబా గాంధీ బాలికల విద్యా నిలయంలో లో ఆత్మహత్యకు పాల్పడ్డ ఇంటర్ విద్యార్థిని భవ్య కేసులో కాలేజ్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వహించిదనే ఆరోపణలు వెళ్ళు వెతుతున్నాయి.ఆత్మకూరు ఆర్డీఓ వెంకట శివ,డీఎస్పీ రామాంజి నాయక్ సంయుక్తంగా చేపట్టిన విచారణకు ప్రిన్సిపల్ కృష్ణ బాయి సహకరించకపోవడంతో ఉన్నతాధికారులు ఆమెను విధుల నుంచి శాశ్వతంగా తప్పించారు.గతంలోనూ మెనూ, పాఠశాల పరిశుభ్రత వంటి లోపాలపై ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు అందజేసినట్లు తెలుస్తుంది