మార్కాపురం: జిల్లా కేంద్రంలో బలిజ చైతన్య సదస్సులో పాల్గొన్న పలువురు ప్రముఖులు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో బలిజ చైతన్య సదస్సు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు కనిగిరి నుండి డాక్టర్ రామానాయుడు కాపు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాపుల ఐక్యత రాజకీయ చైతన్యం భవిష్యత్తు కార్య చరణ పై దిశా నిర్దేశం చేశారు. ఈ సదస్సులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నలుమూలల నుండి బలిజ కాపు నాయకులు హాజరయ్యారు.