రాజమండ్రి సిటీ: గోదావరి పుష్కరాలు: భక్తులకు ప్లాస్టిక్ రహిత తాగునీటి సౌకర్యం.. భారీ ఏర్పాట్లు!
గోదావరి పుష్కరాల్లో భాగంగా భక్తులకు ప్లాస్టిక్ రహితంగా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 32 వేల ట్యాప్ అవుట్లెట్లు, 3 వేల వాటర్ ఏటీఎంల ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.