కనిగిరి: మున్సిపాలిటీలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి మున్సిపాలిటీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో గురువారం పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. స్థానికులు నీటి సరఫరా, పారిశుధ్య సమస్యలపై మున్సిపల్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్... రెండవ వార్డులో నీటి సమస్యలు, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీలోని వెనుకబడిన ప్రాంతాలకు మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.