కనిగిరి: గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి: కనిగిరి మండల పరిషత్ సమావేశంలో ఎంపీపీ ప్రకాశం
కనిగిరి: గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలచకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం సూచించారు. కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులతో ఎంపీపీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసే ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు . ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలకు అధికారులు సమాధానం ఇస్తూనే వారు అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్ శర్మ, జడ్పిటిసి కస్తూరి రెడ్డి పాల్గొన్నారు.