కనిగిరి: పామూరు మండలం గుమ్మలంపాడు లో 200 బత్తాయి చెట్లను ధ్వంసం చేసిన దుండగులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు శేషయ్య
పామూరు మండలంలోని గుమ్మలంపాడు లో రైతు శేషయ్య బత్తాయి తోటను సాగు చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు జెసిబి యంత్రాలతో బత్తాయి తోటలోని 200 బత్తాయి చెట్లను ధ్వంసం చేసి, సోలార్ పవర్ ప్లాంటును కూడా ధ్వంసం చేశారు బుధవారం ఉదయం రైతు శేషయ్య పొలానికి వెళ్లి చూసేసరికి బత్తాయి తోట ధ్వంసమై కనిపించింది. ఈ ఘటనపై రైతు శేషయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతో విభేదాలు ఉన్నవారే ఈ పని చేశారని, వారి పేర్లతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని కోరాడు.