ధర్మపురి: ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ దంపతులు ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జస్టిస్ నర్సింగ్ రావు గారు స్వామివారి అభిషేకం మరియు నారసింహ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.