నల్గొండ: నల్గొండలో రైతు మహాసభలు: నవంబర్ 15న భారీ బహిరంగ సభ
నల్గొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు అఖిల భారత రైతు సంఘం మహాసభలు జరగనున్నాయి. నవంబర్ 15న జరిగే బహిరంగ సభకు వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు పెద్దఎత్తున తరలిరావాలని బి. వెంకట్ పిలుపునిచ్చారు. కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన కోరారు.