మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
Ongole Urban, Prakasam | Mar 7, 2026
వైవి సుబ్బారెడ్డిని జైలుకు పంపితే సంతోష పడే మొదటి వ్యక్తి నేనే అంటూ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శనివారం స్పందించారు. ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారని, దానిపై జిల్లా నాయకులు చూసుకుంటారన్నారు. ఆ వ్యక్తిపై ఏనాడూ తాను కామెంట్స్ చేయలేదన్నారు.