కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని బి.కోడూరు మండల కేంద్రంలో గురువారం బిజెపి కడప జిల్లా ఉపాధ్యక్షుడు రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జంగిడి వెంకట సుబ్బారెడ్డి సూచనల మేరకు మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు.ఈ ఎన్నికకు విశిష్ట అతిథిగా మాజీ జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనాథ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారం లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. సాధారణ సభ్యత్వాలు, క్రియాశీలక సభ్యత్వాలు, బూత్ కమిటీలు వేయించి మెజార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు ద్వారా మండల కమిటీ నియామకం జరిగిందన్నారు.