కనిగిరి: తాడేపల్లి లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన కనిగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్
కనిగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ తాడేపల్లి లో గురువారం వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం లోని వైసిపి ముఖ్య నాయకులను జగన్మోహన్ రెడ్డికి ఆయన పరిచయం చేశారు. కనిగిరి నియోజకవర్గం లో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి... కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైనందున, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై పోరాటం చేసి వారికి అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు నారాయణ యాదవ్ తెలిపారు.