వనపర్తి: వనపర్తిలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు: ఫోటో జర్నలిస్టులను సన్మానించిన ఎస్పీ
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా ఎస్పీ సునితారెడ్డి ఫోటో జర్నలిస్టులను సన్మానించారు. ఫోటో జర్నలిజం సమాజంలోని వాస్తవాలను ప్రజల ముందుకు తెస్తుందని, చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని ఆమె కొనియాడారు.