శ్రీశైలం: ఆత్మకూరులో నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో పోలీసుల కవాతు..
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆత్మకూరు ఎస్సై నారాయణరెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు పట్టణంలో కవాతు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజలకు భరోసా కల్పించారు.