కొత్తపేట: కొత్తపేటలో 30 మంది అంగన్వాడీ హెల్పర్లకు నియామక పత్రాలు అందజేత
కొత్తపేట నియోజకవర్గంలో 30 మంది అంగన్వాడీ హెల్పర్లకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, మౌలిక వసతుల కల్పన మరియు సిబ్బందికి అందిస్తున్న సౌకర్యాల గురించి ఆయన వివరించారు.