మహేశ్వరం: మహేశ్వరం జల్పల్లిలో అడవి పందిని చంపి తీసుకుని వెళ్లిన హీరో మంచు విష్ణు సిబ్బంది, విచారణ చేపట్టిన పోలీసులు
మరో వివాదంలో ఇరుక్కున్నారు సినీ హీరో మంచు విష్ణు సిబ్బంది. జల్పల్లి పరిధిలో అడవిపందిని వేటాడి తీసుకుని వెళ్తున్న విడియో ఫై పోలీసులు విచారణ చేపట్టారు. చట్టప్రకారం అడవి జంతువులను వేటాడటం చట్టవిరుద్ధమని తెలిపిన అధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షిస్తామన్నారు