ఈ నెల 17న జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో సునీల్ కుమార్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. సునీల్‌ను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించే సమయంలో సునీల్ మెడలో ఉన్న 2.2 తులాల బంగారు గొలుసు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత చైన్ మాయమైందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు సంబంధిత పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.