శ్రీశైలం: అడవులను, వన్యప్రాణులను రక్షించుకోవడం మన అందరి బాధ్యత: మహనంది అటవీ శాఖ రేంజర్ మురళీకృష్ణ
అడవులను, వన్యప్రాణులను రక్షించుకోవడం మన అందరి బాధ్యత అని అటవీ శాఖ రేంజర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహానందిలో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులను రక్షించుకోవడం వల్ల మానవాళికి మనుగడ ఉంటుందన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో హైమావతి, సిబ్బంది పాల్గొన్నారు.