ఒంగోలు అర్బన్: ఫ్రైడే డ్రైడే కార్యక్రమమును ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలి:జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రమేష్ బాబు
Ongole Urban, Prakasam | Sep 18, 2026
కలెక్టర్ రాజబాబు ఆదేశాల ప్రకారం మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రమైన వెంకటేశ్వర కాలనీ లో నిర్వహించిన ఫ్రైడేడ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మలేరియా అధికారి రమేష్ బాబు మాట్లాడుతూ కీటక జనత వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని కోరారు.