ASF (M) రౌటసంకెపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల లలిత ను చంపుతానని బెదిరించిన రామోజీ,అతని భార్యపై కేసు నమోదు చేసినట్లు ASF సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. లలిత 2023 లో తను కొనుకున్న ఎకరం భూమిలో పంట సాగుచేసుకుంటుంది. తన భూమిలోకి అదే గ్రామానికి చెందిన రామోజీ,అతని భార్య ఇద్దరు అక్రమంగా ప్రవేశించి ఇల్లు కట్టుకోవడానికి తవ్వడం ప్రారంభిస్తారు. అడ్డుకోవడానికి వెళ్లిన లలితపై ఇద్దరు బూతులు తిడుతూ చంపుతానని బెదిరిస్తారు. బాధితురాలి పిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.