ఖానాపూర్: వరంగల్ మోడల్ స్కూల్ హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: వార్డెన్‌కు నోటీసులు
వరంగల్ జిల్లా బుధరావుపేట మోడల్ స్కూల్ హాస్టల్‌ను కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్ అపరిశుభ్రత, బియ్యంలో పురుగులు కనిపించడంతో వార్డెన్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిత్య పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు.