బనగానపల్లె: బనగానపల్లెలో బిక్షాటన ఎత్తిన వీఆర్ఏలు
నంద్యాల జిల్లా బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఎల నిరవధిక దీక్ష 15వ రోజుకు చేరుకుంది. బుధవారం కార్యక్రమంలో భాగంగా బిక్షాటన అవతారమెత్తారు. వారు మాట్లాడుతూ.. 402 జీవోను సడలించి, పదోన్నతులు కల్పించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.