శ్రీశైలం: బయటపడుతున్న సంగమేశ్వరాలయం మరో మూడు రోజుల్లో వేపదార శివలింగానికి పూజలు నిర్వహించనున్న అర్చకులు
సప్త నదుల సంగమేశ్వరాలయం కృష్ణాజిలాల నుంచి పూర్తిగా బయటపడింది. మరో రెండు మూడు రోజుల్లో వేపదార శివలింగానికి అర్చకులు పూజలు నిర్వహించనున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం శివరాత్రి ఉగాది పర్వదినానికి బయటపడే సంగమేశ్వరాలయం ఏలినో ప్రభావంతో వర్షాలు లేక ఈ సంవత్సరం దసరా పర్వదినం నాటికే బయటపడుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయం ఎనిమిది నెలలు నీటిలో మునిగి నాలుగు నెలలు బయట ఉంటుంది. అటువంటిది ఈ సంవత్సరం 8 నెలలు బయట ఉండి నాలుగు నెలలు మాత్రమే మునిగి ఉంది మరో రెండు మూడు రోజుల్లో పూజలు చేయనున్నారు అర్చకులు.