గద్వాల్: గద్వాల మున్సిపాలిటీలో అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బీజేపీ
గద్వాల మున్సిపాలిటీలో చోటుచేసుకుంటున్న అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు టీ. రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను కలిసి వినతిపత్రం అందించారు. షాపుల అద్దెలు, ఆస్తి పన్ను తగ్గింపు మరియు ఫండ్స్ దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు.