రాయదుర్గం: డి.హిరేహాల్ మండలంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం
డి.హిరేహాల్ మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాదలూరు లో టిడిపి మండల కన్వీనర్ మోహన్ రెడ్డి, డి. హిరేహాల్ లో ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ నాగళ్ళిరాజు, గొడిశలపల్లి లో మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి టిడిపి జూండాలను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు చేశారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినదించారు. వందలాది మంది టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.