ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని బీసి బాలుర వసతిగృహం వద్ద నీటి వృధాను అరికట్టండి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోని బీసిబాలుర వసతి గృహం వద్ద పైపులైన్ నుంచి నీరు వృధాగా పోతుంది, ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో నీటి ఎద్దడి తలెత్తకుండా ఒకవైపు అధికారులు చర్యలు తీసుకుంటుండగా మరోవైపు నీరు ఇలా వృధా అవుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు, సంబంధిత అధికారులు వెంటనే నీటి వృధాను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు