శ్రీకాకుళం: కోర్టు కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి - అక్టోబర్ 1 నుంచి ప్రత్యేక క్యాంపెయిన్
శ్రీకాకుళం జిల్లా కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి అక్టోబర్ 1 నుంచి ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో కేసులు పరిష్కరించుకోవచ్చని న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు తెలిపారు.