పార్వతీపురం: ఎంఈ స్కూల్ దుస్థితిపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం
పార్వతీపురం బైపాస్ కాలనీలోని ఎంఈ పాఠశాల దయనీయ స్థితిపై ఎస్ఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం, డ్రైనేజీ సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది.