నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో 40 వార్డులు ఉన్నాయి. నిత్యం టన్నుల కొద్ది చెత్త సేకరిస్తున్నారు. చెత్తంతా డంపింగ్ యార్డ్ కు తరలించడం, అక్కడ వ్యర్థాలు పేరుకుపోవడం జరుగుతుంది. చాలా కాలంగా మున్సిపాలిటీ పరిధిలోనే చెత్త నుంచి సంపద సృష్టించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కానీ ఆచరణలో కానరావడంలేదు. అయితే కావలి పట్టణాన్ని చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్ కుమార్ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్వచాంధ్ర స్వర్