కదిరి ప్రజల చిరకాల కోరిక సీఎం నెరవేర్చారు : కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన కదిరిలో ఏ డీజే కోర్టు ఏర్పాటును సీఎం చంద్రబాబు నాయుడు కదిరి పర్యటనలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం ఎంతో హర్షించదగ్గ విషయమని కదిరి నియోజకవర్గ ప్రజలు తరపున సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.