కౌడిపల్లి: కౌడిపల్లి నూతన ఎస్ఐగా నీరేష్ బాధ్యతలు స్వీకరణ
కౌడిపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా నీరేష్ బాధ్యతలు స్వీకరించారు. మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఎస్ఐగా ఉన్న అమర్ జిల్లా కార్యాలయానికి బదిలీ అయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ సూచించారు.