సారంగాపూర్: రేచపల్లిలో పెన్షన్ దరఖాస్తులపై అధికారుల విచారణ
సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో పెన్షన్ దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులు, అనర్హులను గుర్తించేందుకు ఎంపీవో సలీం నేతృత్వంలో ఈ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.