ఇల్లందు: టేకులపల్లి సమీపంలో తప్పిన ప్రమాదం: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
టేకులపల్లి సమీపంలో కొత్తగూడెం నుండి ఇల్లెందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, లారీని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగలేదు.