పార్వతీపురం: పిజిఆర్ఎస్ సేవలపై క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన తెలపండి: జిల్లా కలెక్టర్
పార్వతీపురం జిల్లాలో పిజిఆర్ఎస్ సేవలపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. జిల్లా, మండల స్థాయి కేంద్రాల వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సేవలు ఎలా ఉన్నాయో తెలియజేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి సూచించారు.