ఒంగోలు అర్బన్: ఒంగోలు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నుంచి దసరా సెలవులకు 400 బస్సుల అదనపు సర్వీసులు: రీజినల్ మేనేజర్ సత్యనారాయణ
Ongole Urban, Prakasam | Oct 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నుంచి దసరా సెలవులకు 400 బస్సు సర్వీసులను అదనంగా ప్రయాణికుల కోసం కల్పిస్తున్నట్లు ఆర్టిసి రీజినల్ మేనేజర్ సత్యనారాయణ బుధవారం తెలిపారు. దసరా సెలవులకు ప్రజలు సొంత ఊర్లకు అధికంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బస్సులను ప్రజల కోసం అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ అవకాశాలు ప్రజలు వినియోగించుకోవాలన్నారు.