కాకినాడ రూరల్: కాకినాడ RSETI కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ
కాకినాడ రామనయ్యపేటలోని ఆర్ఎస్ఈటీఐ (RSETI) కేంద్రాన్ని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ సందర్శించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. 2025 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 660 మంది అభ్యర్థులు వివిధ నైపుణ్యాల్లో శిక్షణ పొందినట్లు అధికారులు వివరించారు.