కరీంనగర్: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం, సాయం చేసే వారికి నగదు ప్రోత్సాహకం: కలెక్టర్
రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే వారికి రూ. 25 వేల ప్రోత్సాహకం అందిస్తామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. పీఎం రహత్, రహ్వీర్ పథకాలపై అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ప్రమాద సమయంలో 112కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.