కొండపి: సింగరాయకొండ మండలం పాకల ఎస్సీ కాలనీలో రూ. 12 లక్షలతో రెండు ఆర్వో ప్లాంట్లను ప్రారంభించిన మంత్రి స్వామి
సింగరాయకొండ మండలం పాకల ఎస్సీ కాలనీలో రూ. 12 లక్షలతో రెండు ఆర్వో ప్లాంట్లను మంత్రి స్వామి శనివారం రాత్రి ప్రారంభించారు. ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే ఎస్సీ కాలనీల్లో పెద్ద ఎత్తున అంతర్గత రహదారులను,సిమెంట్ రోడ్లు నిర్మించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మారీ టైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు.