కొండపి: మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నదే వైసీపీ కుట్ర: మంత్రి స్వామి
తప్పుడు ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నదే వైసీపీ కుట్రని, అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి స్వామి అన్నారు. టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. టీటీడీ గోశాలపై భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు అర్థరహితమని అన్నారు.