మహబూబాబాద్: ఈ నెల 27న గ్రామ/వార్డు సభలు: ఓటర్ల జాబితా సవరణపై కీలక ఆదేశాలు
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ/వార్డు సభలు నిర్వహించనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా, ఏఎస్డీ జాబితాలను ఈ సభల్లో చదివి వినిపిస్తారు. అభ్యంతరాలు ఉంటే ఫారం 6, 7, 8 ద్వారా తెలియజేయవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.