నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్‌లో చెత్త వేస్తే ఇక జరిమానాలు తప్పవు: కమిషనర్ ప్రశాంతి హెచ్చరిక
నారాయణఖేడ్ మున్సిపల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ ప్రశాంతి ప్రజలకు సూచించారు. రోడ్లపై చెత్త వేసే వారిపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. రెండో వార్డులో వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి ఆమె స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు.