కమలాపూర్: వంగపల్లి గ్రామ శివారులో ఈదురుగాలుల బీభత్సం, మామిడి, సపోటా తోటలకు అపార నష్టంపై ప్రత్యేక కథనం #local issue
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం లక్ష్మీపురం గ్రామం వంగపల్లి శివారులో నిన్న అర్ధరాత్రి ఈదురుగాళ్లు బీభత్సం సృష్టించాయి.సుమారు 50 ఎకరాల తోటలు నాశనమైయ్యాయి. అందులో 45 ఎకరాల మామిడి తోటలు, 5 ఎకరాల సపోటా తోటలు ఉన్నాయి. కాయల దశలో ఉన్న ఫలాలు నేలకొరిగిపోయాయి.పెట్టుబడి దక్కలేదు.. అప్పులు మాత్రం మిగిలిపోయాయి,అంటూరైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన రైతులు