మందమర్రి: మంచిర్యాల రైల్వే స్టేషన్లో విషాదం: గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి
మంచిర్యాల రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొనడంతో శ్రీధర్(46) అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందినవారు. ఘటనపై కేసు నమోదు చేసిన జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.