మార్కాపురం: జమ్మనపల్లి సమీపంలో వెలసిన ముద్దసానమ్మ ఆలయంలో ఆషాడం మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు
మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామ సమీపంలో వెలిసిన ముద్దసానమ్మ ఆలయంలో ఆషాడ మాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి తెల్లవారుజామున పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం వెండి తొడుగు వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఎస్సై విశ్వనాధ రెడ్డి ఎంఈఓ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పొంగళ్ళు తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.