ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రెండు అక్రమ కట్టడాలను మంగళవారం జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. గత ఏడాది టీఆర్ నగర్ లో అక్రమ కట్టడాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు సదరు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. స్పందించక పోవడంతో మంగళవారం జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు ఆర్డీవో లోకేశ్వరరావు ఆధ్వర్యంలో 2 ఇండ్లను తాళాలు వేసి సీజ్ చేశారు. తెలంగాణ పురపాలక సంఘం 2019 చట్టం సెక్షన్ 181(1) ప్రకారం సీజ్ చేసినట్లు చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు నిర్వహించోద్దని వారిని హెచ్చరించారు.