దుత్తలూరు మండలంలోని రాఘవరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతుల పొలాలలో మోటార్ల కేబుల్ వైర్లను దుండగులు చోరీ చేశారు. గ్రామానికి చెందిన 15 మంది రైతులు తమ పొలాలలో మోటార్లు ఏర్పాటు చేసుకుని ఉండగా దుండగులు స్టార్టర్ బాక్సులు పగలగొట్టి కేబుల్ వైర్లు చోరీ చేశారు. దీంతో తాము రూ.1.5 లక్షలు నష్టపోయామని దుత్తలూరు పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు.